Saturday 8 June 2013

ప్రేమా & ఓ ఆకర్షణ

                 ప్రేమ అనగానే నేటి సినిమాలా పుణ్యమా అని అందరైకి మొదటి గుర్తొచ్చేదీ ఒక అమ్మాయి,అబ్బాయి మధ్య ఉండాల్సినది అనే అపోహలో ఉంటారు.
     ఒకసారి ఆలోచిస్తే చిన్నప్పటి నుంచి మనం ఎన్ని రకాలుగా మనం ఎంతమంది ప్రేమతో ఇలా పెద్దవాళ్లమయ్యామో అర్థమవుతుంది.మన పుట్టుకే ఇద్దరి మధ్య ప్రేమతో మొదలవుతుంది.పుట్టగానే అమ్మ,నాన్నల ప్రేమ. పెరుగుతూ మన తోబుట్టువుల ప్రేమ..బడిలో చదువుతూ స్నేహితుల ప్రేమ.వీళ్లందరూ పంచే ప్రేమలో ఒక ఆప్యాయత మనం బాగుంటే వాళ్లు కూడా బాగునట్టే అనుకునే ఒక పిచ్చితనము కనిపిస్తాయి.అదేంటో కానీ ఉన్నట్టుండి ఒకరోజు వస్తుంది,చూపులు..చూపులు కలుస్తాయి.ఒకరి కోసం ఒకరు అన్నంత తపన కలుగుతుంది,ఇదంతా ప్రేమ అనే భ్రమలో ఇద్దరు మునిగి బాధ్యతలు మరిచిపోతారు తాత్కాలికంగా అంటే మన చదువు మీద శ్రద్ధ తగ్గుతుంది.మాటి మాటికి అమ్మ చెప్పే మాటలు విసుగ్గా అనిపిస్తాయి,నాన్న అంటే పెద్ద పులి రూపమే గుర్తొస్తుంది.స్నేహితులు ఎప్పుడెప్పుడు మనల్ని వదిలిస్తే తన దగ్గరికి వెళ్దామా అన్నట్టు ఉంటుంది. సెల్లు రీఛార్జిలా కోసం వందలు వందలు ఖర్చవుతాయి.  కొన్నిరోజుల వరకు ఇది ఒక వైభోగంలా, మనకు మాత్రమే పట్టిన అదృష్టంలా అనిపిస్తుంది.
నిజమైన ప్రేమ కలకాలం ఉంటుంది
                   అంత అదృష్టానికి మనం మురిసిపోతుండగా మెల్లిగా మన అబాధ్యతయుతానికి ఫలితాలు రావడం మొదలువుతాయి.చెల్లినో,అక్కనో,తమ్ముడినో డబ్బు కోసం దెబేరించడం మొదలుపెడతాం..ఇంక చదువులో మార్కుల సంగతి నాన్నగారు పట్టించుకోకూడదని అనుకుంటాం కానీ మంచిగా చదివి జీవితంలో స్థిరపడాలన్న విషయం మర్చిపోతాం. ఇంత చేసి అరకొర మార్కులతో సంపాదించిన డిగ్రీ చెతబట్టుకుని పొట్టకూటి కోసం నగరవీధుల్లో తిరుగుతూ కూడా తన ఙ్ఞాపకులుంటే చాలు జీవితానికి ఇంక ఏమి అక్కర్లేదన్న మనకు తెలియని ఒక సిద్ధంతాన్ని నమ్ముతూ గుడ్డిగా బతికేస్తాం.. ఆ గుడ్డితనంలోంచి బయటపడేయడానికి ఎవరూ రారూ!!
                    ఒకతి పైన ఒకరికి నిజంగా ప్రేమే ఉంటే మాటిమాటికి మిమ్మల్ని మారమని అవతలి వ్యక్తి అడగరు.అలా అడుగుతున్నారు అంటే ఒకసారి ప్రశ్నిచుకోవాలి,అది మీకు ఇష్టమైన మార్పా?ఆ వ్యక్తి ప్రయోజనాలా కోసం జరుగుతున్న మార్పా అన్నది?? ప్రేమకు, ఆకర్ష్ణకు మధ్య ఉన్న సన్నని గీత ఉంటుంది. అది మొదట్లోనే తెలుసుకుని అలాంటి ఆకర్షణలో తప్పులు చేయకుండా మసులుకోవాలి.

                నిజమైన ప్రేమ అంటే ఒకరి పట్ల ఒకరు బాధ్యాతయుతంగా నడుచుకుంటూ కేవలం ప్రేమ అనగానే సినిమాలు,షికార్లు,పార్కులు అని చూపించే మన తెలుగు సినిమాల్లా కాకుండా జీవితంలో ఇద్దరూ తమ కాళ్లపైన నిలబడే వరకు ఒక అండలా ఉండాలి..అది జీవితాంతం బలపడే బంధంగా మార్చుకునే క్రమంలో ఎన్ని అడ్డంకులు ఎదురైనా ధైర్యంగా ముందుకు సాగిపోవాలి.అంతే కానీ అవసరాల కోసం చూపించే ప్రేమ వలలో పడకండి.ఒకసారి పడితే బయటపడటం కష్టం.

      

               

Sunday 2 June 2013

నాహృదయభావాలు - 1

                       చిన్నప్పటి నుంచి నాకు డైరీ వ్రాసుకునే అలవాటు లేదు.. ఇక నుంచి రోజులో జరిగినవి, ముఖ్యంగా నన్ను చాలా బాధపెట్టే విషయాలు వ్రాస్తాను..ఎందుకంటే వాటిని పంచుకునే నా అనుకున్న మనుషులు నాకు దూరమయ్యారు కాబట్టి..నేను వేసే అడుగు సరైందో..కాదో చెప్పటానికి ఎవరో ఒకరు ఉంటారు..ఇక్కడ.. సంతోషాన్ని అందరితో పంచుకోవచ్చు..కాని బాధ ఎవరితో చెప్పుకోవాలో తెలియక ఇలా బ్లాగు మొదలుపెట్టాను...